– పలువురి అభినందనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఇన్స్పైర్,వైజ్ఞానిక ప్రదర్శనలో అశ్వారావుపేట జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్ధులు పాల్గొని వారు స్థానికంగా రూపొందించిన ప్రయోగం ఫలితాలను జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. మండల స్థాయిలో ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక అయిన ఒక విద్యార్ధి తో పాటు మరో ఆరుగురు విద్యార్ధులు తాము తయారు చేసిన ప్రదర్శనలతో హాజరుకానున్నారు.
ప్రధానోపాధ్యాయురాలు హరిత ఆధ్వర్యంలో గైడ్ టీచర్లు లక్ష్మయ్య,చలపతిరావు,మధుసూధనరావు, సువార్తమ్మ, పర్వీన్, మధుబాబు ల సహకారంతో ప్రదర్శనలను సిద్ధం చేసారు. వీటిని గురువారం నుండి రెండు రోజులు పాటు కొత్తగూడెం లోని సెంట్ మేరీస్ స్కూల్ లో జరిగే జిల్లా స్థాయి ప్రదర్శన పోటీలలో ప్రదర్శించనున్నారు. విద్యార్ధులు ప్రదర్శనలు తయారు చేయడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యయురాలు హరిత, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులను అభినందించారు.



