Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంహైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్‌

హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్‌

- Advertisement -

బీసీ రిజర్వేషన్లపై ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు, తాజాగా హైకోర్టు తీర్పును కాపీని జత చేసింది. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇంద్ర సాహ్నీ వర్సెస్‌ యూనియన్‌ గవర్నమెంట్‌ తీర్పును రిఫరెన్స్‌ గా పిటిషన్‌ లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ తీర్పు ప్రకారం… రిజర్వేషన్లు 50 శాతం క్యాప్‌ దాటొద్దని చెబుతోన్నా… అది కేవలం విద్యా, ఉపాధి రంగాలకే పరిమితం అని ప్రభుత్వం వాదించనుంది. అందువల్ల రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్‌ లో ప్రస్తావించింది. కాగా… ఇటీవల స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు ఉపసంహరించుకునేందుకు స్వేచ్ఛ నిస్తూ డిస్మిస్‌ చేసింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈనెల 8,9 న తేదీల్లో సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు జీవో నెంబర్‌ 9పై స్టే విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -