Magazines

జ్ఞానాక్షరం

15 నవంబర్, 2026

Knowledge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

సత్యానికి సంకెల వేయలేక మృత్యువును కానుకిచ్చింది కాలం చరిత్ర చెప్పిన సజీవ సాక్ష్యం కొన్ని మరణాలు అజరామర జననాలని చీకటి కుహరంలోంచి చిగురుటాకై మొలకెత్తినందుకే నేమో లోకపు వాకిలిలో వసంతాన్ని పరువాలని కలగన్నాడు లోపాల పాపకూపాల లోకంలో నిజాల నిగ్గుదేల్చేందుకు నిత్యం నిప్పుల కొలిమై మండినవాడు అతడు అధ్యయన మార్తాండుడు సత్యశోధక సైధ్ధాంతికుడు కులాలు, మతాలు, కుల్లు రాజకీయాలు కుదురుగా ఉండనీయని సామాజిక విచలనాలు భద్ర జీవితాన్ని కాదని బాధ్యతల శిలువనెక్కించాయి ఎన్ని సంవేదనల శకలాలను శోధించాడు ఎంత సార్థక్య సారాన్ని బోధించాడు వ్యక్తి వ్యవస్థగా పరిణామం చెందిన ప్రగతిశీల ప్రయోక్త అతడు మరణాన్ని చిరునవ్వుతో స్వాగతించిన సాహసీ.. చరిత్ర చెక్కిలిపై నీ సంతకం సమస్త పీడనలనెదిరించే సశస్త్ర జ్ఞానాక్షరాల సమరం.. నువ్వు మా మెలకువ పాఠానివి చీకటిలోంచి మేల్కొలిపే కువకువల ప్రభాతానివి !
( ప్రగతిశీల విశ్లేషకుడు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్‌‌కు నివాళిగా..)
గాజోజు నాగభూషణం, 9885462052

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్