‘ది ఫర్గాటెన్ మావెరిక్’ ఆవిష్కరణ
పెండ్యాల రాఘవరావు జీవితం ఆధారంగా మను నెల్లుట్ల రచించిన “The Forgotten Maverick” పుస్తకావిష్కరణ సభ ఈ నెల 24న ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వుంటుంది. కడియం కావ్య (ఎం.పి.), కె. శ్రీనివాస రెడ్డి, కూరపాటి వెంకట రమణ, నెల్లుట్ల రమాదేవి, కందిమళ్ల ప్రతాపరెడ్డి, పెండ్యాల శ్రీకృష్ణదేవరావు, దేవులపల్లి అమర్, నెల్లుట్ల వేణుగోపాల్, డాక్టర్ పాలకుర్తి దినకర్ పాల్గొంటారు. వివరాలకు కొండపల్లి నీహరిణి - 98663 60082
24న ‘చూపుడువేలు’ ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ, ఎదిరెపల్లి మశమ్మ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎదిరెపల్లి కాశన్న రచించిన ‘చూపుడువేలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ రవీంద్రభారతిలో 24న ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ సభలో వనపట్ల సుబ్బయ్య, నందిని సిధారెడ్డి, జూలూరు గౌరీశంకర్, డా.ఏనుగు నరసింహారెడ్డి, డా. కవి యాకూబ్ పాల్గొంటారు. 9640006304
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
సభ
వనపర్తి సాహితీ సమితి & సాహితీ కళా వేదిక వనపర్తి వారి సంయుక్త ఆధ్వర్యంలో డా.రూప రచన ‘కాలగమనం’ గేయ సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 29న మధ్యాహ్నం. 2 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతుంది. డా. జుర్రు చెన్నయ్య, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డా. ఏనుగు నరసింహా రెడ్డి, కె. ఆనందాచారి, డా. ఎస్. రఘు, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, వనపట్ల సుబ్బయ్య, పి.శంకర్ గౌడ్, భూక్యాశ్రీను నాయక్, C. శ్రీనివాస్, యం.బాలకృష్ణ హాజరవుతారు.
భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ 2027
సమకాలీన సామాజిక సమస్యలు, మానవీయ విలువలు, శిల్ప వైవిధ్యం గల కథానికల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. చివరి తేదీ: డిసెంబర్ 25. కథానిక DTP/ Word file A4 sizeలో 4 పేజీలకు మించరాదు. [email protected] లేదా వాట్సాప్ నం: 9793059793. లేదా ‘‘సమన్వయకర్త, ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ – 2027, ఆనంద నిలయం, ఇం.నం. 1-5-1020/4, బి. ఆర్. రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్–500010’’ చిరునామాకు పంపవచ్చును. వివరాలకు 99636 16999.
మహాకవి జాషువా పురస్కార ప్రదానోత్సవం
వేణు ఉడుగుల (ప్రముఖ కవి, సినిమా దర్శకుడు)కు జాషువా పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 28న సాయంత్రం 6 గం||లకు ఖమ్మం, ప్రియదర్శి డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. జాషువా పద్యశిల్పం - కొమ్మవరపు విల్సన్ రావు, గుగ్గిలం - సంపాదకులు డప్పోళ్ల రమేష్ ల పరిచయం. మువ్వా శ్రీనివాసరావు, శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్, డా. ప్రసాద మూర్తి, అంబటి మురళీ కృష్ణ, డా. కాటేపల్లి నవీన్, డా. గుమ్మా సాంబశివరావు పాల్గొంటారు.
జాషువా సాహిత్య వేదిక, ఖమ్మం
‘జయజయహే గీతామృతం’ ఆవిష్కరణ
డా
॥ రాపోలు సుదర్శన్ రచన 23న సాయంత్రం 6.00లకు రవీంద్రభారతిలో జరుగనుంది. డా. నాళేశ్వరం శంకరం, డా. ఏనుగు నరసింహారెడ్డి, మోతుకూరు నరహరి, డా.రియాజ్, వేల్పుల నారాయణ, వాక్కులమ్మ పాల్గొంటారు. - అరసం





కామెంట్లు (0)