Magazines

ఎడారి కోయిల

12 నిమిషాల క్రితం

Desert
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

కలల లోకంలో కన్నీటి అలలు చెరిగిపోని భావ దారిద్ర్యపు విహంగం సాలెగూడు పందిరిలో ఆశల హరివిల్లు ఎడారి కోయిల రాగాల పల్లవి అమావాస్య వెన్నెల! అమ్మతనం ఆత్మీయత కంసుని చెరసాల స్వేచ్చా పతాకం ఊపిరి గాలిలో ఊగిసలాడే దీపం మట్టి పొరలు తడితనం లేమితో పచ్చని ఆకుల చప్పుళ్లు చెవిటివాడి ముందు శంఖారావం పెదవి దాటని మౌనం ముళ్ల బాట నడక లక్ష్మణ రేఖపై ఆకాంక్షల ఉరిత్రాళ్లు! పసి ఎదలో రేపటి భవితవ్యం తెగిన పతంగం లేనోడి ఆర్తనాదం దున్నపోతు మీద కురిసిన వాన ఉన్నోడి మాట పాలకుల ఎర్ర తివాచి అంతరాల అగాధం అణగారిన జనాల ఉక్రోషం సమస్యల సుడిగుండంలో పడి లేచే కెరటం అన్యాయంపై ఆఖరి పోరాటం! స్వార్థం ఎన్ని వేషాలు వేసినా సామాన్యుడి కాలి చెప్పుల కింద నలిగి స్వేచ్చా విముక్తి ఉద్యమానికి తలవంచక తప్పదు ప్రజలే న్యాయ నిర్ణేతలు ఈ ప్రజాస్వామ్యంలో.. నియంత పాలకులకు తప్పదు పరాభవం ఏనాటికైనా!
కొండా రవీందర్, 9059237771

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్