Magazines

అదిగో రైతు తండ్రి...!

15 నిమిషాల క్రితం

farmer's
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

ఎవరైనా ఇంత బువ్వ తినవలసిందే కదా కాలం మీద ముఖం ఆరేసుకోవడానికి! బువ్వకు గర్భసనం పోసేది పట్టెడు నేల కదా! నేల తడిపే నింగిరెప్పల జడివానలో చినుకులే కదా! ఒంటిమీద వస్త్రం ఉండి లే కా నో చినుకు తలపాగా చేసుకున్న రైతు తండ్రి! తలమీద సూర్యున్ని అంబటి కుండ తట్టతో రైతు తండ్రి భుజం నీడైనా రైతు తల్లి కదా! శ్రమ భూమిని పిసికి బువ్వ అక్షయపాత్ర చేసింది ఇన్నాళ్లు! ఇప్పుడు నింగి రెప్పల వాన చినుకులు ఏమో కానీ నీలంతా పగుళ్ళ పుండై రాలుతున్న కాలం మీద రైతు కన్నీళ్ళ కొత్త సంద్రం దేశ రాజధాని మీద ఉప్పొంగి పారుతుంది. ఒకానొకప్పుడు కాలం వెనకాల రైతు ప్రకృతి పాఠం చెప్పేవాడు లోకం బడి పిల్లల వినేది. ఇప్పుడు.. ఏమైందో కాలం మీద గత్తెర సోకినట్లు గద్దనెక్కిన ప్రతివాడు ప్రతిపక్షం ప్రతివాడు రైతుకు నీతి బోధలు చేస్తుండ్రు కులం మీద, మతం మీద పెద్దమ్మ పోతుల పడి తిరిగే రాజకీయాలు రైతు మీద పడి బ్రతుకుతున్నాయి. ఇప్పుడు రైతు దిక్కుతోచని దిక్కులు చూస్తలేడు ఆత్మహత్యల మర్మం తెలుసుకుండు నాగలి విరిగి కాలిపోయి బూడిద అయిన కాలం మీదే అదిగో రైతు తండ్రి....! చౌరస్తాలో పిడికిలి బిగించిన పోస్టర్ అయి నిలబడిండు నల్లగొండ కిల్లా మీద మళ్లీ యుద్ధ శంఖారావం పూరిస్తుండు!

జన జ్వాల, 9949163770

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్