వివేకానంద ఫౌండేషన్ కథాసంకలనం.. యువత చైతన్యం కోసం రచనల ఆహ్వానం..
వివేకానంద ఫౌండేషన్ ‘ఆరోగ్యకరమైన యువతరం’ లక్ష్యంగా కథాసంకలనాన్ని ముద్రిత పుస్తకం, ఈ-బుక్ రూపంలో ప్రచురించేందుకు సాహిత్యాభిమానులు, రచయితల నుండి నూతన రచనలు ఆహ్వానిస్తోంది. నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం, అశ్లీల కంటెంట్, డిజిటల్ వ్యసనాలు వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ, యువతలో మార్పు తెచ్చే సాహిత్యం ఇతివృత్తాలతో వున్న కథలు 1,000 నుండి 2,000 పదాల మధ్యలో వున్న కథ పిడిఎఫ్/ టెక్ట్స్ ఫైల్‌ను నవంబర్ 18 లోగా వాట్సాప్ / మొబైల్: 9908345303, ఈ-మెయిల్: [email protected] పంపించాలి.
హామీపత్రం జతచేయాలి.
అంబటి వెంకన్న సాహిత్య సమాలోచన సదస్సు
తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో.. అంబటి @ 30 అంబటి వెంకన్న సాహితీయానం, అంబటి వెంకన్న సాహిత్య సమాలోచన సదస్సు ఈ నెల 22న ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్, రవీంద్రభారతి కాన్షరెన్స్ హాల్లో జరుగుతుంది. డా॥ బెల్లి యాదయ్య, డా॥బి. నర్సింగరావు, డా॥ ఏనుగు నరసింహారెడ్డి, విమలక్క, డా॥ నామోజు బాలాచారి, కె. శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, లక్ష్మీనరసయ్య, మునాసు వెంకటేశం, పి. కరెంట్ రావు, ఆర్.కె. వెంకట్, బండారు శంకర్, పల్లె సతీష్ తదితరులు పాల్గొంటారు.
సాహితీ విశేషాలు
15 నవంబర్, 2026
balaji
ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)