Thursday, January 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం సోదరుడికి సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం సోదరుడికి సిట్ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కొండల్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేశారని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం తీసుకోవడం కోసం విచారణకు పిలుస్తున్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు కూడా ఇలాంటి నోటీసులు జారీ అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -