లూయిస్ మండే డాగూరే కు ఘన నివాళి
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
నవతెలంగాణ-పాలకుర్తి
ఫోటో స్టూడియో లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఆదుకోవాలని ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు రాపోలు రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు.
ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే చిత్రపటానికి రాంబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఫోటో స్టూడియోల పైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో, డిజిటల్ వ్యవస్థలో ఫోటోగ్రాఫర్ల జీవన విధానం దయనీయంగా మారిందని తెలిపారు. ఫోటోగ్రాఫర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందించి ఆదుకోవాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఫోటోగ్రాఫర్ ఆసరా పెన్షన్ అందించాలని అన్నారు.188వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.
మాటల్లో చెప్పలేని మధుర జ్ఞాపకం, వేయి మాటలు చెప్పలేని భావన ఫోటో మాత్రమే చెప్తుందని, మన మధుర జ్ఞాపకాలని సమాజానికి అందిస్తుందని తెలిపారు. నిత్యజీవితంలో సంఘటనలకు నిలువెత్తు సాక్ష్యం ఒకటేనని తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ రాపోలు లక్ష్మణ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ పట్టురి శ్రీనివాస్, ఎడవెల్లి వెంకన్న, కార్యదర్శి గజ్జి రాజు, గుడికందుల నరేష్, చిలుముల్ల బాబు, బొమ్మగాని ప్రదీప్ కుమార్, వర్ధమన్ శ్రీనివాస్, పన్నీరు సంతోష్,శ్రీకాంత్, ఎలిగేటి సోమన్న, మార్గం సతీష్,కొత్తూరు మధు, చిలువేరు మహేష్, గుగ్గిళ్ళ సురేష్, చిరురాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.