Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు నిషేధం 

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు నిషేధం 

- Advertisement -

జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టిఎస్ దివాకర 
నవతెలంగాణ – భూపాలపల్లి
: భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈత కొట్టడం, ఫోటోలు,  వీడియోలు తీయడంపై నిషేధం విధించినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర తెలిపారు. శనివారం  గోదావరి నదిలో ఈత కొట్టడానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మరణించిన సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.  గోదావరి నదిలో  ఈత కొట్టడం, ఫోటోలు దిగడం,   సోషల్ మీడియా కోసం వీడియోలు తీయడం, రీల్స్ రూపొందించడం వంటివి ప్రమాదకరమైన చర్యలుగా మారుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో ఈ కార్యకలాపాలపై నిషేధం విధించబడినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత రీల్స్ కోసం తీయు వీడియోలు ప్రమాదకరంగా మారుతున్నాయని, అవి ప్రమాదాలకు దారి తీసి ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపారు.  నిషేధ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృతంగా టామ్ టామ్ వేయించాలని, పటిష్ట గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈత కొట్టడం, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధించబడినదని ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి గోదావరి, చెరువులు, కాలువలు వంటి వాటిలో ఈతకు వెళ్లడం, ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం వంటివి నిషేదమని ప్రజలు గమనించాలని ఆయన స్పష్టంచేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ప్రాణాలు కాపాడుటలో యంత్రాంగం  జాగ్రత్తగా ఉండాలని, భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -