నవతెలంగాణ- ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయిలో ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ఉపాధ్యాయులు విద్యార్థులచే మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ సమక్షంలో నిర్వహించారు. ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మండల కన్వీనర్ రావుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ .. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 8,9 తరగతులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని అన్నారు. మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి మాట్లాడుతూ .. సబ్జెక్టు ఉపాధ్యాయులు అందరూ తమ, తమ సబ్జెక్టులలో మేధస్సును వెలికి తీసేలా ఇలాంటి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఇలాంటి ప్రతిభా పరీక్షల వల్ల విద్యార్థులలో పోటీ తత్వం అలబడుతుందని, మెదడు చురుకుతనంగా తయారయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తు కాలంలో ఇలాంటి టాలెంట్ టెస్టులు పోటీ పరీక్షలలో సిద్ధం కావడానికి ఉపయోగపడతాయని అన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నట్లు కన్వీనర్ రావుల సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ ప్రతిభ పరీక్షలో ప్రథమ స్థాయి బహుమతి పొందిన ఆలేరు పియం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన చొప్పదండి సంజయ్, ద్వితీయ స్థానం పొందిన శారాజిపేట పాఠశాలకు చెందిన సిహెచ్ సంధ్య, తృతీయ స్థానం పొందిన జడ్పీహెచ్ఎస్ టంగుటూరు కు చెందిన ఎం సాక్షరను ఉపాధ్యాయులు అభినందించారు. వీరిని త్వరలో జిల్లా స్థాయిలో జరగబోయే పరీక్షకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ ఆలేరు ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, బూడిద శ్రీను, కర్నె చంద్రశేఖర్, నాగేశ్వరరావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



