- Advertisement -
నవతెలంగాణ- గాంధారి
మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగులకు వ్యాయామ చికిత్సను డాక్టర్ స్వాతి నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని మండలవిద్యాశాఖఅధికారి శ్రీహరి సందర్శించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నరాల బలహీనత తో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులందరూ ఈ వ్యాయామ పరీక్షలను వినియోగించుకోవాలని మరియు వారానికి రెండు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రాన్ని సందర్శించి త్వరితగతినపనులుపూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య, రిసోర్స్ టీచర్ సాయన్న, సిఆర్పి షాహిద్ మరియు పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -