- Advertisement -
హైదరాబాద్ : హైదరాబాద్ పికిల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి పికిల్ బాల్ ఓపెన్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. హైదరాబాద్‌లోని ప్యాడిల్‌వేవ్ వేదికగా రెండు రోజుల పాటు రౌండ్ రాబిన్, నాకౌట్ ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఓపెన్ విభాగంలో మహిళలు, పురుషుల సింగిల్స్, డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ప్యాడ్లర్లు పోటీపడనున్నారు.
సుమారు 200 మంది క్రీడాకారులు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్‌లో విజేతలకు రూ.1.5 లక్షలు నగదు బహుమతి అందిస్తున్నామని హైదరాబాద్ పికల్‌బాల్ సంఘం అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు తెలిపారు.
- Advertisement -