- Advertisement -
- కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
- నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
- బస్వాపురం ప్రాజెక్టు పరిధిలో ముంపుకు గురవుతున్న లప్ప నాయక్ తండ ప్రజలకు రెండు సంవత్సరాల క్రితం కేటాయించిన ఇంటి స్థలాలను వెంటనే పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం కోసం అయ్యే ఖర్చుకు పరభుత్వం సహకారం అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండ, సీపీఐ(ఎం) కుటుంబ సమగ్ర సర్వేలో భాగంగా గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న కల్లూరి మల్లేశం మాట్లాడుతూ బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రామంలో ఉన్న 750 ఎకరాల భూమిని, నివాస ప్రాంతాలను పూర్తిగా ప్రజలు ఇచ్చారని కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట మీద లేదని గత రెండు సంవత్సరాల క్రితం ఇంటి స్థలాల కోసం ఫ్లాట్స్ చేసి నేటికీ పంపిణీ చేయలేదని విమర్శించారు.
ఇంటి స్థలాలు పంపిణీ చేయక పోవడంతో ప్రభుత్వ మిచ్చిన డబ్బులు ఇప్పటికే ఖర్చు చేశారని సకాలంలో ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తే ఈపాటికి నిర్మాణం అయ్యేదని తెలియజేశారు. నేటికీ గ్రామంలో 60 ఎకరాలకు నష్టపరిహారం పైసా అందలేదని ఇంకో 60 మందికి 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ పెండింగ్ లో ఉన్నదని, ఆరు కుటుంబాలకు ఏ విధమైన ప్యాకేజీ అందలేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేటికి నిర్లక్ష్యం చేయకుండా ఎన్నికల ముందు లప్ప నాయక్ తండా ప్రజలకు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సర్వేలో నరేష్ నాయక్, నవీన్ నాయక్ , ప్రవీణ్ నాయక్, అభిలాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



