నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం : ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ ఎంఈ) పథకానికి అర్హులైన లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం మండల ఐకేపీ ఏపీఎం సాంబశివుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంఎఫ్ఎం ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయన్నారు. ఈ పథకంలో పుట్టగొడుగుల పెంపకం, పన్నీర్, పాలకోవా, వివిధ కూరగాయల పంటల పెం పకం కోసం అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలి గిన మహిళలు ఈ నెల 14న మండల కేంద్రం లోని ఐకేపీ కార్యాలయంలో దరఖాస్తులు చేసు కోవాలని సూచించారు. ఎంపికైన మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అన్ని యూనిట్లకు 35 శాతం రాయితీ ఉంటుందని పేర్కొన్నారు..
పీఎంఎఫ్ఎంఈ దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



