Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలో 30 సీసీ టి.వి కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమీషనర్

టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలో 30 సీసీ టి.వి కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమీషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ వంటి నగరాల్లో, నేరాలను నియంత్రించడానికి, ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఇందులో భాగంగా టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిదిలో గల దాతల సహకారం తో 30 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సీసీ కకెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పి. సాయి చైతన్య ముఖ్య అతిది గా విచ్చేసి టౌన్ 6 పోలీస్ స్టేషన్ లో గల కమాండ్ కంట్రోల్ రూమ్ ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు స్థానిక భాష (ఉర్దూ) లో  వివరించారు. కమ్యూనిటీ భాగస్వామ్యంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో స్థానిక ప్రజలు మరియు వ్యాపారులు సహకరించినందుకు పోలీస్ కమిషనర్ వారి అభినందించారు. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో నేరస్తులను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తక్కువగా జరుగుతాయని, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని తెలిపారు.ట్రాఫిక్ నిర్వహణలో కొన్నిసార్లు సీసీ కెమెరాలు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి, ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి ఆక్సిడెంట్ వాహనాలను గుర్తించడం లో సహాయ పడతాయని అన్నారు. ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తాయని, తమ ప్రాంతంలో నిఘా ఉందనే విషయం ప్రజలకు ధైర్యాన్నిస్తుందని వివరించారు.సాంకేతికత వినియోగంలో పోలీస్ శాఖ నేరాల నియంత్రణలో సాంకేతికత ను ఎలా ఉపయోగిస్తుందో వివరించి, కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ను ఇతర సాంకేతిక పరిజ్ఞానాల గురించి కూడా ప్రస్తావించారు. భవిష్యత్తులో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రణాళికల గురించి నగరంలో భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల గురించి తెలియజేశారు.ఈరోజు మనమందరం కలిసి మన ప్రాంతంలో కొత్తగా సీసీ కెమెరాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కెమెరాలు కేవలం ఒక నిఘా వ్యవస్థ మాత్రమే కాదు, ఇది మనందరి భద్రతకు ఒక పెద్ద అండ. గతంలో నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు, సీసీ కెమెరాల సహాయంతో క్షణాల్లో వారిని పట్టుకోగలుగుతున్నాం. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ప్రజలకు, వ్యాపారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరంతా ఇలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను.ప్రజలందరూ కూడా తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలి, ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే, మన నగరాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చవచ్చు అని తెలియజేశారు.ఈ సీసీ కమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఏ సి పి రాజా వెంకట్ రెడ్డి, నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్,6 వ టౌన్ ఎస్సై వెంకట్ రావ్,  పోలీస్ సిబ్బంది, సీసీ కెమెరాలు దాతలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -