Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ 

పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పట్టణంలో   జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని  పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య బుధవారం పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలని, సిబ్బంది ఎక్కడ కూడా అలసత్వం వహించరాదని, ఓటర్లతో మరియు ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలను తూ.చా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం, సంతోష్ నగర్ లోని విద్య హైస్కూల్లో పోలింగ్ బూతులను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. సిపి వెంట ఏసీపి శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ, ఏ.ఆర్.ఓ భూమేశ్వర్, ఎన్నికల సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -