దేవరాంపల్లి లో 6 గురు పేకాట రాయుళ్ల అరెస్టు
అందరు బడా బాబుల్లె, చిన్నపటి నుండి పేకాటే వీళ్ళ వ్యసనం, వృత్తి పేకాటే…
నవతెలంగాణ – కాటారం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని దేవరాంపల్లి లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట అడ్డా ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్నరన్న పక్క సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాటారం, గారెపల్లి గ్రామాలకు చెందిన శ్రీనివాస్, రమేష్, మలహార్ రావు మండల్, కొండంపేట గ్రామానికి చెందిన రాజేశ్వర్, వెంకటేశ్వర్లు. మహాదేవపూర్ మండలానికి చేందిన లక్ష్మి నారాయణ లు పట్టు బడ్డట్లు కాటారం ఎస్ ఐ శ్రీనివాస్ వెల్లడించారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్స్ తో పాటు 20040రూ. నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ పేర్కొన్నారు
పేకాట స్తావరం పై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES