నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని వివిధ పాన్ షాపులు, కిరాణా షాపుల పైన భువనగిరి పట్టణ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి సోమవారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిషేధిత పొగాకు సంబంధిత ప్యాకెట్లను సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి పట్టణంలోని రామ్ నగర్ లోని చిన్నం శ్రీశైలం ఇంట్లో భారీ ఎత్తున నిషేధిత పొగాకు సంబంధ ప్యాకెట్లను సీజ్ చేశారు. ఇట్టి వ్యక్తుల పైన క్రిమినల్ కేసులను నమోదు చేయడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో స్థానిక ఇన్స్పెక్టర్ ఎం . రమేష్ మరియు లక్ష్మీ నరసయ్య, లక్ష్మీనారాయణ, నరేష్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. పట్టణంలో నిషేధిత గంజాయి సమాచారం ఏమైనా ఉన్నచో పోలీసులకు తెలియజేసి సహకారం అందించగలరు.
నిషేధత పోగాకు ప్యాకెట్లను సీజ్ చేసిన పోలీసులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES