కేర్‌ఎడ్జ్ అంచనా
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు భారత వజ్రాల వ్యాపారాన్ని తీవ్ర ప్రభావితం చేయనున్నాయని రేటింగ్ ఎజెన్సీ కేర్‌ఎడ్జ్ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) రంగం ఎగుమతులు 17-20 శాతం పతనమై సుమారు 11 బిలియన్ డాలర్లకు పరిమితం కావొచ్చని అ సంస్థ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది 2024-25లోనూ 17.5 శాతం క్షీణతతో 13.3 బిలియన్ డాలర్లకు పడిపోగా.. ఈ రంగం మరింత ఒత్తిడిని ఎదుర్కొనుందని హెచ్చరించింది. ఈ రంగం ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడం, అమెరికా విధించిన అధిక సుంకాలు, ల్యాబ్‌లో తయారైన డైమండ్స్ (ఎల్‌జీడీ) నుంచి పెరుగుతున్న పోటీ వంటి బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోందని కేర్‌ఎడ్జ్ తెలిపింది. ప్రపంచంలోని పాలిష్డ్ డైమాండ్స్ ఉత్పత్తిలో భారత్ 90 శాతం వాటాను కలిగి ఉంది. అమెరికా ఒక్కటే ప్రపంచ పాలిష్డ్ డైమండ్ వినియోగంలో 40 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని గురి చేసింది. అమెరికా ఇటీవల విధించిన 50 శాతం వరకు సుంకాలు అక్కడి మార్కెట్‌లో ధరలను పెంచే ప్రమాదం ఉందని తెలిపింది. అధిక టారిఫ్‌లు వినియోగదారుడిపై భారాన్ని పెంచడంతో డిమాండ్ తగ్గనుందని తెలిపింది.
పాలిష్డ్ డైమాండ్స్ ఎగుమతుల్లో 20 శాతం పతనం..
- Advertisement -
- Advertisement -