Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయ కక్ష్యలు మానుకోవాలి..

రాజకీయ కక్ష్యలు మానుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షలకు పాల్పడుతున్నరని  బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి  అన్నారు. వెల్దండ మండల కేంద్రంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  రాజకీయాలంటే కక్షలు కాదు సైదాంతిక పోరాటమనే విషయాలు మర్చిపోయి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.  కెసిఆర్ ను రాజకీయంగా,  సైదాంతికంగా ఓడించలేక  కక్షపూరితంగా రాజకీయ  కుట్రలు పన్నుతున్నరని ఆయన పేర్కొన్నారు.

గతంలో శాసనసభలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారని ప్రగల్బాలు పలికి ఇప్పుడు కెసిఆర్ మీద సిబిఐ విచారణ  చేపిస్తాం అనడం ఎంతవరకు సమంజసంమన్నారు. నిజంగా కెసిఆర్ హయాంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే శాస్త్రీయంగా నిరూపించాలన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు జంగిలి ప్రసాద్, పోలే అశోక్,తగుళ్ల కొండల్ యాదవ్,  శేఖర్ , రఘు గౌడ్,  గణేష్ , సైదులు, పిల్లి శ్రీను,  బాలకృష్ణ,  మల్లేష్, ఈదులపల్లి శ్రీనివాసులు,గోరటి దశరథము,  అన్వర్, రాజు,రమేష్, జహీర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -