Sunday, September 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామా

బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామా

- Advertisement -

అందరూ అనుకూలమే… అడ్డుకుంటున్నదెవరు?
హైకోర్టు వ్యాఖ్యలతో స్థానిక పోరు మళ్లీ మొదటికి
పిటిషన్‌ దాఖలుపై భగ్గుమంటున్న బీసీ సంఘాలు
ఈడబ్ల్యూఎస్‌ కోటాకు లేని అడ్డంకులు బీసీలకే ఎందుకంటూ నిలదీత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘అందరూ శాఖాహారులే…గంపకింద కోడి మాయమైంది’ అన్నట్టే ఉంది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సమర్థించి, బిల్లుకు ఆమోదం తెలిపాయి. కానీ దానిపై చట్టపరంగా ఒక్క అడుగూ ముందుకు పడట్లేదు. సర్కారు దీనిపై జీవో తెస్తే, దాన్ని కోర్టులో సవాలు చేస్తున్నారు. అలా చేస్తారని ప్రభుత్వానికీ తెలుసు. అయినా ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పుడు రిజర్వేషన్ల బంతిని ప్రభుత్వ ‘కోర్టు’లోకి నెట్టి రాజకీయపార్టీలు ఏం జరుగుతుందో వేచిచూద్దాం అన్నట్టే వ్యవహరిస్తున్నాయి. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు వర్తింప జేయాలని రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసినా…గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. చట్టరూపం దాల్చలేదు. న్యాయకోవిదుల సలహా పేరిట రాష్ట్రపతి కార్యాలయం కోర్టులో ఆ బంతి పడింది. కేంద్రంలోని బీజేపీ పార్టీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకు ఓకేగానీ ఆ కోటా నుంచి వెనుకబడిన ముస్లింలను తీసేస్తేనే మద్దతు తెలుపుతామంటూ అడ్డుతగులుతున్నది. దాని ప్రభావం గవర్నర్‌ నిర్ణయంపై స్పష్టంగా కనిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్ల తేనెతుట్టెను కదలిస్తే తమ అధికార మూలాలకు ఎక్కడ ఎసరు వస్తుందో అన్న భయంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు అనుకూలం అంటూనే… ముస్లింలలో వెనుకబడిన సామాజిక తరగతుల వారిని అందులో చేర్చినందుకు తాము మద్దతు ఇవ్వబోమంటూ మెలిక పెట్టి కూర్చున్నది. మరోవైపు ఇక్కడేమో కాంగ్రెస్‌ సర్కారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడం లేదంటూ, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ సర్కారు మోసం చేస్తుందంటూ ప్రతి రోజూ బీజేపీ రాష్ట్ర నేతలు మీడియా ముందు గోల చేస్తున్నారు. బీజేపీ పల్లవిని రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే తప్పుబడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను మోడీ సర్కారే తీసుకొచ్చిన విషయం విదితమే. అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవులు సైతం ఉన్నారు. అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు లేవనె త్తుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం దీనిపై సమా ధానం దాటవేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమ యంలో, మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటూ కాంగ్రెస్‌ సర్కారు ముందుకెళ్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ రాష్ట్ర సర్కారు జీవో విడుదల చేసినప్పటికీ…ఆ జీవో ఎంత వరకు నిలుస్తుందనే దానిపై ధర్మసం దేహం వ్యక్తమవుతున్నది. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా విడుదల వుతుం ది? అది న్యాయపరంగా ఎలా నిలుస్తుంది? అని మొదటి నుంచీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తు న్నది. అనుకున్నట్టే హైకోర్టు సైతం ఇదే అంశాన్ని లేవనెత్తిం ది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పిటిషన్‌ దాఖలైన ందున విచారణ చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేస్తూ పది రోజుల్లో స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కా రుకు ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో స్థానిక ఎన్నికల కథ మళ్లీ మొద టికొచ్చినట్టు అయింది.

ఈడబ్ల్యూఎస్‌కు లేని అడ్డంకులు బీసీ రిజర్వేషన్లకే ఎందుకు?
దేశంలో ఆధిపత్య కులాల్లోని పేదల కోసం కేంద్రంలోని మోడీ సర్కారు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. అయితే, ఆ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేయకుండా రాష్ట్రాల పైకి ఆ బాధ్యతను నెట్టింది. ఆధిపత్య కులాల్లోని పేదల సంఖ్యను బట్టి ఆయా రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఒక శాతం నుంచి పది శాతం వరకు అమలు చేయొచ్చని సెలవిచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తు న్నాయి. ఈ విషయంలో తమిళనాడు సర్కారు నిరాక రిస్తూ తన వైఖరిని స్పష్టం చేసింది. తమ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయబో మంటూ తేల్చిచెప్పింది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాత్రం అమలు కోసం శశిధరణ్‌ కమిటీని వేయగా…ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కులాల్లోని పేదల శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. దానికి అనుగుణంగా అక్కడి ప్రభుత్వం ముందుకెళ్లింది. తెలంగాణలో మాత్రం పదిశాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడూ అదే అమలవుతున్నది. తెలంగాణలో ఎలాంటి కమిటీగానీ, కమిషన్‌గానీ వేయకుండా డైరెక్టుగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారు? ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు లేని రాజ్యాంగ షరతులు, నిబంధనలు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారు? అసలు దేశంలో, రాష్ట్రంలో ఆధిపత్య కులాల వారి శాతం ఎంతనో తేల్చండి? నిజంగా పదిశాతం ఉంటారా? అన్న ప్రశ్నలను బీసీ సంఘాల నేతలు సంధిస్తున్నారు. అంతిమంగా రాజకీయ క్రీడలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాదిన్నరగా వాయిదా పడుతూనే ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపో యాయి. పల్లెల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఏరోజుకారోజు గడిస్తే చాలు అన్నట్టు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -