Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు విస్తరణ పనులకు రాజకీయ గ్రహణం..?

రోడ్డు విస్తరణ పనులకు రాజకీయ గ్రహణం..?

- Advertisement -

10 ఏళ్లుగా డివైడర్ నిర్మాణానికి ఆసక్తి చూపని పాలకులు
వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి లింగాల రోడ్డు 400 మీటర్లు ఫోర్ లైన్స్ రోడ్డు విస్తరణ పనులు చేయాలని రోడ్ల భవన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. రోడ్డు విస్తరణ పనుల కోసం రోడ్డును ఆక్రమించుకొని నిర్మించిన ఇండ్లను తొలగించడానికి అధికారులు గతంలో గుర్తించి మార్కింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులతో పాలకులు, అధికారులు కుమ్మక్కయ్యారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. 

రోడ్డు విస్తరణ లేకపోవడం వల్ల వాహనదారులు రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్నారు దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్ పనులు జరుగుతాయని పట్టణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ప్రస్తుతం మునిసిపల్ అధికారులు డివైడర్ పనులు చేయకుండా డివైడర్ కోసం రోడ్డు మధ్యలో వదిలిన ఖాళీ స్థలంలో సీసీ రోడ్డు నిర్మించి చేతులు తెలుపుకున్నారు. సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. రోడ్ల భవనాల శాఖ చేయవలసిన పనిని నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లబ్ధి కోసం  మునిసిపల్ శాఖ జర్నల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి పనిచేయడం చేయడంలో పట్టణంలో ఛాయా (టీ కోట్టు) ల పలువురు  చోట్ల చర్చించుకుంటున్నారు.  డివైడర్ సిసి రోడ్డు వేయడం పట్ల వాహనదారులు వేగంగా వాహనాలు నడుపుతారని దీంతో ప్రమాదాలు అధికంగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -