నవతెలంగాణ-పాలకుర్తి
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎంపీడీవో రవీందర్, తహాసీల్దార్ నాగేశ్వరాచారి రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాను ప్రదర్శించినట్లు తెలిపారు. తప్పులు దొర్లుతే సరిచేసేందుకు వీలుందని సూచించారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. వేర్వేరు వార్డులో నమోదు అయితే సవరించేందుకు దరఖాస్తు చేసుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాకేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES