Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఢిల్లీలో జరిగే బీసీ బిల్లు ధర్నాకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ఢిల్లీలో జరిగే బీసీ బిల్లు ధర్నాకు రాజకీయ పార్టీలు సహకరించాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఈనెల5,6,7 తేదీలలో ఢిల్లీలో జరిగే బీసీ బిల్లు ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని బిసి సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం మండలంలోని కొయ్యూరు చౌరస్తాలో జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్చార్జ్ విజయగిరి సమ్మయ్య నాయి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీసీ బిల్లుకు సహకరించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీలో 42 శాతం బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు.ఢిల్లీలో జరిగే బీసీ బిల్లు ధర్నాకు రాజకీయ పార్టీల హాజరై మద్దతు ప్రకటించాలని కోరారు.బిసి బిల్లుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి, రాష్ట్రపతి ఆమోదానికి దేశ రాజధానిలో కలిసినట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ బిల్లుకు బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు,బీసీ కుల సంఘాలు,బీసీ సంఘాలు, అందరు హాజరై బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.మద్దతు ప్రకటించని రాజకీయ పార్టీలకు స్థానిక సంస్థలో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గడ్డం చంద్రయ్య,యాదoడ్ల రామన్న,కొడారి చిన్న మల్లయ్య, జంగిడి సమ్మయ్య, యాదoడ్ల గట్టయ్య, అడ్డురి తిరుపతి, బాపు, వెంకన్న,నరేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -