Sunday, January 11, 2026
E-PAPER
Homeఖమ్మంస్వల్ప సంఘటనలు మినహా.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

స్వల్ప సంఘటనలు మినహా.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

- Advertisement -

అశ్వారావుపేట లో 87.85 శాతం నమోదు
గాండ్లగూడెం లో అత్యధికం – పాతల్లిగూడెం లో అత్యల్పం
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్వల్ప వాగ్వివాదాలు, తోపులాటలు మినహా అశ్వారావుపేట మండలంలో రెండో దశ స్థానిక ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాధారణ స్థానిక ఎన్నికలు – 2025 లో భాగంగా నిర్వహించిన ఈ పోలింగ్‌ కు ఓటర్లు భారీగా హాజరై ప్రజాస్వామ్యంపై తమ నమ్మకాన్ని చాటుకున్నారు. మండలంలోని 25 పంచాయితీలు, 220 వార్డులకు గాను పోలింగ్ జరగ్గా, మొత్తం 29,867 మంది ఓటర్లలో 26,239 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మండలంలో 87.85 శాతం పోలింగ్ నమోదు అయింది.

పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, శిక్షణా కలెక్టర్, అశ్వారావుపేట మున్సిపాల్టీ చీఫ్ కమిషనర్ సౌరవ్ శర్మ, ఎంపీడీఓ అప్పారావు లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.సీఐ నాగరాజు,ఎస్ఐ లు యయాతి రాజు,కే.అఖిల లు  భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.

మండలంలో గాండ్లగూడెం పంచాయితీలో అత్యధికంగా 93.12 శాతం పోలింగ్ నమోదు కాగా, పాతల్లిగూడెం లో అత్యల్పంగా 82.75 శాతం పోలింగ్ నమోదైంది. మిగతా పంచాయితీల్లో కూడా పోలింగ్ శాతం ఆశాజనకంగా ఉండటం విశేషం. మొత్తం ఓటర్లలో పురుషులు 14,538, మహిళలు 15,327 మంది ఉండగా, ఓటు హక్కు వినియోగంలో మహిళలు ముందంజలో నిలిచారు.

మొత్తం ఓటు వేసిన వారిలో మహిళలు 13,371 మంది, పురుషులు 12,868 మంది ఉండటం గమనార్హం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. మొత్తంగా అశ్వారావుపేట మండలంలో పోలింగ్ ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా సాగి ఎన్నికల యంత్రాంగానికి ఊరటనిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -