Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిల్లుల ఇటుక బట్టీల కాలుష్యాన్ని నివారించాలి

మిల్లుల ఇటుక బట్టీల కాలుష్యాన్ని నివారించాలి

- Advertisement -

సబ్ కలెక్టర్ కు గ్రామస్తుల వినతి 
నవతెలంగాణ – మిర్యాలగూడ

మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామ పరిధిలో గల రైస్ మిల్లులు, ఇటుక బట్టీల కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని గూడూరు గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలోని రైస్ మిల్లుల పొగదారా గ్రామంలోని ఇండ్లలోకి విపరీతంగా పడుతుందని వారన్నారు. రైస్ మిల్లులో బాయిల్డ్ చేసిన నీరును రీసైక్లింగ్ చేయకుండా రోడ్డు వెంబడి వదిలి వేస్తున్నారు. దీంతో గ్రామం మొత్తానికి విపరీతమైన దుర్వాసన వస్తుందని వారు తెలిపారు. అద్దంకి నార్కెట్పల్లి హైవేకు ఇటుక బట్టీల నుండి విపరీతమైన బూడిద వస్తుందని వాహనదారులకు పాదచారుల కళ్ళలో పడి కంటి జబ్బులు వస్తున్నాయని  అన్నారు. ఈ హైవేపై రైస్ మిల్లుల సమీపంలో ఈ బూడిద వల్ల  యాక్సిడెంట్లు అంగవైకల్యం మరణాలు సంభవిస్తున్నాయని వెంటనే మిల్లుల ఇటుక బట్టీల కాలుష్య నివారణకు వారు డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో బొంగరాల మట్టయ్య. మూగల సైదులు యాదవ్. నూకపంగా కాశయ్య తదితరులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -