Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా పోలు సంపత్ 

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా పోలు సంపత్ 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడిగా పోలు సంపత్ ను శుక్రవారం గ్రామ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పోలు సంపత్ మాట్లాడుతూ.. మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ల సమస్యల పరిష్కారంతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం తో గ్రామాలకు నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు. 

ఉపసర్పంచ్ ల మండల అధ్యక్షుడిగా రాజ్ కుమార్ 
ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షునిగా పోతారం ఉప సర్పంచ్ బొమ్మగాని రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల  ఉప సర్పంచ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17 గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -