Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాలతో జలకల సంతరించుకున్న చెరువులు

భారీ వర్షాలతో జలకల సంతరించుకున్న చెరువులు

- Advertisement -
  • – పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం…
    – లోతట్టు ఎండలోకి చేరిన వర్షం నీరు..

    నవతెలంగాణ- రాయపోల్
    గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయపోల్ మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం గురువారం అర్ధరాత్రి మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో కాలనీలు,ఇండ్లలోకి భారీగా వర్షం నీరు చేరింది. బుధవారం 69.5 మీ.లీ , 50.4 మీ.లీ వర్షపాతం నమోదయింది. అలాగే అన్ని గ్రామాలలో చెరువులు కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. పలు గ్రామాలకు రోడ్లపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అనాజీపూర్ చెరువు నిండి మత్తడి దుంకడంతో రాయపోల్- అనాజీపూర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తపల్లి చెరువు నుండి ముత్తటి దుంకడంతో రాంసాగర్ – కొత్తపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు.
  • అనాజిపూర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే రాయపోల్, మంతూర్ గ్రామంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి  నీరు చేరాయి. ప్రజలు బయటకు వెళ్లాలని పరిస్థితి. ఎక్కడ మురికి కాలువలు ఉన్నాయో, ఎక్కడ రోడ్లపై గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోతాయేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు  గ్రామాలలో సరైన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాక వరద నీరు ఇలా ఇండ్లలోకి వస్తున్నాయని, మురికికాలువలు సరిగ్గా శుభ్రం చేయక వాటిలో ఉండే చెత్తాచెదారం, మట్టి ఎప్పటికప్పుడు తీసివేయకపోవడం, ఎప్పుడో ఒకసారి తీస్తే ఆ చెత్త, మట్టి కుప్పలను తీసివేయక అక్కడే ఉంచడంతో ఏదావిధిగా మళ్లీ ఆ చెత్త,మట్టి మురికికాలువలోకి చేరుతుంది.
  • దానితో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీటితో మురికి కాలువలు నిండిపోయి కాలనీలు జలమయం అవుతున్నాయి. దానివల్ల ఇండ్లలోకి వర్షపు నీరు వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురికి కాలువల మరమ్మతులు చేపట్టి ఇండ్లలోకి వరదనీరు  రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిండిన చెరువులు, కుంటలను తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో బాలయ్య, ఎస్సై మానస పరిశీలించి రోడ్లమీదకు వరద నీరు చేరిన ప్రదేశాలలో ప్రజలను వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad