- Advertisement -
- – యంగ్ ఇండియా స్కూల్ కు కేటాయింపు
– స్వచ్చందంగా ఖాలీ చేయాలి: తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ - నవతెలంగాణ – అశ్వారావుపేట
- ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వేసిన గుడిసెలను స్వచ్చందంగా తక్షణమే తొలగించాలని అశ్వారావుపేట తహశీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ గురువారం పేదలకు హుకుం జారే చేసారు. అశ్వారావుపేట సర్వే నెంబర్ 1228 లో ఓ ప్రైవేట్ సంస్థ అతిథి గృహం అనుకుని ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న యంగ్ ఇండియా స్కూల్ కు కేటాయించారు.
అయితే ఈ ప్రభుత్వ స్థలంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ళ క్రితం మే ఒక వామపక్ష రాజకీయ పార్టీ ఆద్వర్యంలో పేదలు సుమారు 150 గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. దీంతో తహశీల్దార్ అదనపు ఎస్ఐ ఊకే రామ్మూర్తి తో గుడిసె వాసుల వద్దకు వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సిన దిగా ఆదేశించారు.లేనిపక్షంలో ఏ క్షణంలో అయినా బలవంతంగా ఖాలీ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
- Advertisement -