– 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాదరణ పొందే ఏకైక పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ మరింత సమగ్ర విశిష్ట కథనాలు అందించాలని షెడ్యూల్ కులాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో బుధవారం ‘నవతెలంగాణ’ 2026 క్యాలెండర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి అవిష్కరించారు. విలేకరులకు, ప్రజాప్రతినిధులకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ..ఉన్నది ఉన్నట్టుగా వార్తలు రాసే ఏకైక పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని అన్నారు. దీనికి ఉదాహరణ నవతెలంగాణ పత్రికలో వచ్చిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వమే స్పందించిందన్నారు. ఇందులో భాగంగానే భూపాలపల్లి జిల్లాలో పర్యటించి హాస్టల్ తనిఖీ చేసి, సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి నిత్యం ప్రజా సమస్యలు వెలికితీసే దినపత్రిక అని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ ముందుంటుందన్నారు. నవతెలంగాణ తనదైన ఒరవడిలో వార్తలను ప్రచురిస్తూ అందరి మన్ననలను పొందుతోందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా ప్రజాసమస్యలను ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని సూచించారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని. నవతెలంగాణ పత్రిక ప్రజల మన్ననలు పొందుతూ, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరిస్, సత్య శారద, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి.శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంతు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజరు కుమార్, పీఆర్వో అమృత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రజాదరణ ఉన్న పత్రిక ‘నవతెలంగాణ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



