Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి...

రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి…

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి… గడ్డం వెంకటేష్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి వివిధ మండలాలకు వెళ్లే రహదారులు గుంతల మయంగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్నాయనీ వెంటనే  గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ భాస్కర రావు కి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి రాత్రి సమయాలలో వర్షం పడ్డ సమయంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అంగవైకల్యం పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని, ప్రధానంగా భువనగిరి నుండి రామన్నపేట మీదుగా చిట్యాల నల్లగొండ జిల్లాకు భారీ వాహనాలు ప్రయాణం చేస్తుంటాయనీ , అలాంటి రోడ్డు గుంతల మయంగా మారడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ  అన్నారు.

భువనగిరి జిల్లా కేంద్రం నుండి జగదేవపూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. దుర్మార్గమైన పరిస్థితి జిల్లా కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యిందనీ, అధికారులు వెళ్లే రహదారి ఈ రకంగా ఉంటే కనీసం పట్టించుకునే నాధుడు లేడని  ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి ఇతర మండలాలకు గ్రామాలకు వెళ్లే గుంతల మయంగా మారిన రహదారులను గుంతలను పూడ్చి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. వీరితో పాటు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల మల్లేష్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -