– వినియోగదారులకి గమనిక
నవతెలంగాణ – అశ్వారావుపేట
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రహదారి విస్తరణ లో భాగంగా మంగళవారం, బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఎన్పీడీసీఎల్ అధికారులు సోమవారం ప్రకటించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణం లో కొత్త కరెంటు టవర్స్ పై 33 కేవీ, 11 కేవీ,ఎల్టీ వైర్స్ కలపడం,రహదారికి ఇరువైపులా ఉన్న పాత పోల్స్ ,వైర్ తొలగించే క్రమం లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని కావున వినాయకపురం రోడ్ (పోలీస్ స్టేషన్ నుండి పెద్ద రైస్ మిల్), ఓల్డ్ ఆంధ్రాబ్యాంక్ వీధి,దండాబత్తుల బజార్,గాంధీ బొమ్మ సెంటర్,ముస్లిం బజార్,దూదేకుల బజార్,చిన్నంశెట్టి బజార్, తూర్పు బజార్,వడ్డెర బజార్, అంబేద్కర్ నగర్,గౌడ బజార్, తిరుమల నగర్,శివయ్య గారి బజార్,గుర్రాల చెరువు రోడ్,రామాలయం బజార్, కోనేరు బజార్, పేటమాలపల్లి ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 3 గంటలు వరకు విద్యుత్ అంతరాయం కలుగును. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
అశ్వారావుపేటలో విద్యుత్ అంతరాయం
- Advertisement -
- Advertisement -


