- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
విద్యుత్ సరఫరాలో లోపాలను నివారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విద్యుత్ శాఖ ఏడిఈ ఆర్ సురేష్ అన్నారు. మంగళవారం విద్యుత్ అధికారుల ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కట్టంగూరు లో ఏఇ వి.హుస్సేన్ తో కలిసి వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామలశేఖర్ ను కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పలు వీధులలో స్తంభాలు అవసరం ఉన్నాయని, మరి కొన్ని చోట్ల స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, లూప్ లైన్లు ఉన్నాయని వాటిని సరిచేయాలని సర్పంచ్ కోరారు. వారి వెంట లైన్ మెన్ రవికుమార్, సిబ్బంది గోశిక ఉమాపతి, ముక్కామల వెంకన్న, కోనేటి శ్రీను ఉన్నారు.
- Advertisement -



