Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeసినిమాపవర్‌ఫుల్‌గా 'జిల్‌ జిల్‌..' సాంగ్‌

పవర్‌ఫుల్‌గా ‘జిల్‌ జిల్‌..’ సాంగ్‌

- Advertisement -

తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్‌’ విజయం తర్వాత విజయ్‌ ఆంటోనీ ‘భద్రకాళి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రామాంజ నేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, మీరా విజయ్‌ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మేకర్స్‌ తాజాగా ‘జిల్‌ జిల్‌..’ అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. విజయ్‌ ఆంటోని పవర్‌ఫుల్‌ సాంగ్‌గా దీన్ని కంపోజ్‌ చేశారు. భోలే షావలి స్వయంగా రాసి, పాడిన ఈ సాంగ్‌ హై ఎనర్జీతో ఆకట్టుకుంది. సాంగ్‌లోని పవర్‌ ప్యాక్డ్‌ విజువల్స్‌ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి. తెలుగులో ‘మార్గన్‌’ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా సపోర్ట్‌ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్‌ ఉంది. ఈ సినిమా ఈనెల 19న రిలీజ్‌ కానుంది. ‘భిన్న కథలతో మా కథానాయకుడు విజయ్‌ ఆంటోనీ ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఆ కోవలోనే ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్‌ తెలిపారు.
వాగై చంద్రశేఖర్‌, సునీల్‌ కపలానీ, సెల్‌ మురుగన్‌, తప్తి రవీంద్ర, కిరణ్‌, రినీ బోట్‌, రియా జిత్తు, మాస్టర్‌ కేశవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం – అరుణ్‌ ప్రభు, నిర్మాత – రామాంజనేయులు జవ్వాజి, డీఓపీ – షెల్లీ కాలిస్ట్‌, ఎడిటర్‌ – రేమండ్‌ డెరిక్‌, యాక్షన్‌ – రాజశేఖర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – శ్రీరామన్‌, తెలుగు రైటర్‌ – రాజశేఖర్‌ రెడ్డి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad