”కన్నప్ప’ కోసం చర్చలు జరుగుతున్న టైంలో శివ బాలాజీకి ఇందులో ఎందుకు పాత్ర ఇవ్వలేదు అని విష్ణుని మోహన్ బాబు అడిగారు. శివ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదని విష్ణు చెబితే, లేదు.. లేదు.. శివ బాలాజీ కచ్చితంగా ఉండాలి అని మోహన్ బాబు అన్నారు. దీంతో నేను మహదేవశాస్త్రి కొడుకు పాత్ర రూపంలో
ఈ చిత్రంలోకి వచ్చేశాను’ అని నటుడు శివబాలాజీ తెలిపారు.
హీరో విష్ణు మంచు నటించిన పాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మోహన్ బాబు నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ బాలాజీ బుధవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఓ గొప్ప పాన్ ఇండియా సినిమాలో భాగం అవ్వాలనే భావనతో నా పాత్ర నిడివి తక్కువైనప్పటికీ నటించాను. ఈ సినిమాను నేను చూశాను. అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తరువాత రేంజ్ మారుతుంది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్‌లాల్ ఎంట్రీ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తుంది. శివుడిగా అక్షరు కుమార్ అత్యద్భుతంగా నటించారు. ఆయన పాత్ర అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది.
ప్రస్తుతం మంచి కథలు వస్తేనే చేస్తున్నాను. ‘రెక్కీ’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింధూరం’ అనే మరో మూవీ చేశాను. ఇప్పుడు ‘రెక్కీ 2’, మోహన్ బాబు ప్రొడక్షన్లో హీరోగా మరో సినిమా చేస్తున్నాను.
ప్రభాస్, విష్ణు సంభాషణలు అద్భుతం
- Advertisement -
- Advertisement -