- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కార్తీక మాస ప్రభాత్ పేరి కార్యక్రమాలు భక్తి పరవశంలో ముగిశాయి. ఆదివారం మద్నూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ మందిరం ఆవరణలో ప్రభాత్ పేరి ముగింపు సందర్భంగా అన్నప్రసాదం నిర్వహించారు. గత 35 రోజులుగా ప్రతీ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి, గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ భజనలతో ఆలయాల ప్రదర్శన చేసిన భక్తులు భక్తి ఉత్సాహాన్ని చాటారు. కార్యక్రమం ముగింపు రోజున సామూహిక సత్యనారాయణ పూజ నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు సమష్టిగా పాల్గొని, కార్తీక ప్రభాత్ పేరిని ఆధ్యాత్మిక పర్వదినంగా మార్చారు.
- Advertisement -



