నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ రచయిత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన “ప్రభాత సుమాలు” గ్రంథం ను సినీ గేయ రచయిత నంది అవార్డ్ గ్రహీత సాదనాల వెంకటస్వామి నాయుడు ఆవిష్కరించారు. ఖమ్మంలోని కాచిరాజుగూడెం జయవిలాసిని గార్డెన్ లో వికాస వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సాహితీ వనభోజన కార్యక్రమం లో ప్రముఖ రచయిత్రి గాజుల భారతీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ సభలో విశిష్ట అతిథి గా విచ్చేసిన సాధనాల మాట్లాడుతూ సమాజాన్నీ నిర్దేశం చేసేది సాహిత్యమేనని, మంచి సాహిత్యం ఎన్నో తరాలు నిలిచి పోతుందని అన్నారు.కులమతాలకు అతీతంగా సాహితీ వనభోజన కార్యక్రమాలను వికాస వేదిక నిర్వహిస్తున్నదని అన్నారు.
ప్రముఖ కవి నామవరం కాంతేశ్వరరావు పుస్తక సమీక్ష నిర్వహించారు. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు అనేక అంశాలపై పరిశోధక వ్యాసాలు ఈ పుస్తకం లో రచయిత అందించారని అన్నారు.వికాస వేదిక బాధ్యులు లెనిన్ శ్రీనివాస్, బుక్కా సత్యనారాయణ లు మాట్లాడుతూ ప్రభాకరాచార్యులు చక్కని భావ సంపద తో పదునైన రచనలు చేస్తున్నారని పరిశోధక విద్యార్థులకు సాహితీ వేత్తలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో లెనిన్ శ్రీనివాస్ కొంపల్లి రామయ్య, తిరునగరి శ్రీనివాసరావు ,సుబ్రహ్మణ్యంయడవెల్లి శైలజ, జయవాసు తదితరులు పాల్గొన్నారు.



