– రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ హామీ ొ మేడిపల్లిలో రజక ఆత్మగౌరవ భవన స్థలం పరిశీలన
నవతెలంగాణ-బోడుప్పల్
రజక ఆత్మగౌరవ భవన స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడతామని, చుట్టూ ప్రహరీని నిర్మిస్తామని రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లిలో రజక ఆత్మగౌరవ భవనం స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని ఇటీవల తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు.. స్థలాన్ని పరిశీలించాలని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణితో కలిసి రాష్ట్ర రజక ఫెడరేషన్ ఎండీ కబ్జాకు గురవుతున్న రజక ఆత్మగౌరవ భవన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవనం చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మిస్తామని, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థలాన్ని కాపాడే బాధ్యత బీసీ సంక్షేమ శాఖ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో వారి వెంట తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, రజక సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొన్నే సంపత్, జిల్లా కార్యదర్శి జ్యోతి, మేడిపల్లి మండల రజక సొసైటీ అధ్యక్షులు అంబే చక్రపాణి, జిల్లా నాయకులు సట్టు రవి, వీరనారి చిట్యాల ఐలమ్మ మునిమనమరాలు సంధ్య, నాయకులు స్వప్న, సట్టు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రజక ఆత్మగౌరవ భవన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES