- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఈ మేరకు తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో తన పుట్టినరోజు కేక్ కట్ చేసిన కేటీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కేక్ ను తినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -