నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలలో పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ కు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో వాలీబాల్ క్రీడల్లో జంగిటి విజయలక్ష్మి మొదటి బహుమతి, కిక్ బాక్సింగ్లో వర్ధిని గోల్డ్ మెడల్, నల్ల మాసు భవిష్ వాలీబాల్ లో ద్వితీయ బహుమతి, కోకో పోటీలలో సుమన, అక్షిత, శబ్నం నిగర్, కీర్తి భవాని ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
వారితో పాటుగా వాలీబాల్ లో మనోజ్ రాజేష్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటకూర యాదయ్య విద్యార్థులను అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ ఉపాధ్యాయ బృందం, పాల్గొన్నారు.



