తిరువీర్ ప్రధాన పాత్రలో, ఎస్.పి.దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యభరిత చిత్రం ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈచిత్రాన్ని ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత రుద్రదేవ్ మాదిరెడ్డి మాట్లాడుతూ,”డైరెక్టర్ దుర్గ నరేష్ స్టోరీ చెప్తుంటే ఫస్టాఫ్ నెరేషన్‌లో ఆయన ప్యాషన్, హార్డ్ వర్క్ అర్థమయ్యాయి. గడ్డం రాకేష్ రెడ్డి లాంటి పార్ట్‌నర్ ఉంటే సినిమా ఈజీగా చేయొచ్చు. తిరువీర్ అమేజింగ్ ఆర్టిస్ట్’ అని అన్నారు. ‘ఈ టీవీ విన్‌తో ఇది నా సెకెండ్ ప్రాజెక్ట్.
అప్పట్లో జంధ్యాల సినిమాలో చూసినట్లు ఈ సినిమాలో నటీనటులను చూస్తారు. థియేటర్లలో నవ్వులు గ్యారెంటీ సినిమా ఇది’ అని నిర్మాత గడ్డం రాకేష్ రెడ్డి చెప్పారు. డైరెక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ, ‘ఇది మామూలు సినిమా అవదు. రాసి పెట్టుకోండి.. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుంది’ అని చెప్పారు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికష్ణ మాట్లాడుతూ,’పాపం ప్రతాప్ వీర ప్రతాప్‌గా ఎలా మారాడన్నదే ఈ సినిమా కథ. ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ, జంధ్యాల సినిమాలాగా ఉన్న సినిమాలు రావట్లేదు. అందుకే అలాంటి సినిమాను మళ్లీ అందరికీ చూపించబోతున్నాం’ అని తెలిపారు. ‘నా సినిమాలకు ప్రశంసలు మాత్రమే కాదు.. డబ్బులు కూడా వస్తాయని ఈ సినిమా నిరూపిస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే సినిమా’ అని హీరో తిరువీర్ చెప్పారు.
నవ్వించే ప్రతాప్..
- Advertisement -
- Advertisement -



