Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం

ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం

- Advertisement -

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్..
నవతెలంగాణ – తుంగతుర్తి
ముందస్తు అరెస్టులు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని,ప్రజల గొంతు నొక్కే ప్రయత్నమని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో మండల కేంద్రంలోని నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చట్టం అందరికీ సమానంగా ఉండాలని,నిరసన తెలిపే హక్కును హరించడం హేయనీయమని బిఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బొజ్జ సాయికిరణ్, బొంకూరి మల్లేష్, కొండగడుపుల వెంకటేష్, కడియం గోపి, గడ్డం నితిన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -