Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలి

ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలి

- Advertisement -

మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మక్క డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో ఐసీడీఎస్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో 8 రకాల వినతిపత్రాలు అందజేశారు. తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలనీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ అయిన వారిని జీవో నెంబర్‌ ఎనిమిది పరిధిలోకి తీసుకొచ్చి పెరిగిన బెనిఫిట్స్‌ అమలు చేయాలనీ, పది నెలల సీబీఈ అమౌంట్‌ వెంటనే చెల్లించాలని కోరారు. 24 రోజుల సమ్మె వేతనాలు, మూడు నెలల పీఆర్సీ ఏరియర్స్‌, బతుకమ్మ సెలవులు ఇవ్వాలని విన్నవించారు. ఇప్పుడు ఇస్తున్న యూనిఫాంలను తక్షణమే వెనక్కి తీసుకొవాలనీ, సింగిల్‌ కలర్‌ నాణ్యమైంది ఇవ్వాలని విన్నవించారు. స్థిరంగా ఒకే మోడల్‌ ఉంచాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తొందరగా పరిష్కారమయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad