Tuesday, May 13, 2025
Homeమానవిఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

- Advertisement -


ఎండలు మండుతున్నాయి. స్కూళ్ళకు వేసవి సెలవులు కావటంతో పిల్లలు ఇళ్లలోనే గడిపే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చే అలవాటు ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు. అయితే వేసవి కాలంలో వేడి, ధూళి, కాలుష్యం వంటి సమస్యల వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.

వేసవి వేడి తీవ్రంగా ఉండే ఈ సమయంలో పిల్లలకు చిరాకు పెట్టించే పాలిస్టర్‌ బట్టలు కాకుండా, తేలికగా ఉండే కాటన్‌ దుస్తులను వేయాలి. ఇవి చెమటతో ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఒకవేళ పిల్లలు బయటకు వెళ్లే అవసరం వస్తే కాపాడేందుకు లోషన్స్‌ వాడాలి. ఇది చర్మాన్ని రక్షిస్తూ దద్దుర్లు, తామర వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా వేసవిలో చెమట ఎక్కువగా రావడం వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు సహజమైన నేచురల్‌ రెమిడీస్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు ఉపయోగించాలి. ఇవి యూవీ కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సెలవుల్లో పిల్లలు ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ తింటారు. ఇంకా కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ తీసుకుంటారు. ఇది గ్యాస్‌, కడుపునొప్పి, ఫుడ్‌ పాయిజనింగ్‌ వంటి సమస్యలకు దారితీస్తుంది. వీటిని నివారించేందుకు శుభ్రమైన, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందించాలి. పిల్లలు బయట ఆడి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలి. లేకపోతే క్రిములు ఇంట్లోకి చేరి అనారోగ్య సమస్య లకు కారణమవుతాయి. ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎక్కువ గా నీరు తాగడం మరిచిపోతారు. దీని వల్ల డీహైడ్రేషన్‌కి లోనవుతారు. కాబట్టి వారిని తరచూ నీరు తాగమని చెప్పాలి.
సెలవుల్లో పిల్లలు స్నాక్స్‌కు అలవాటు పడిపోతారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఇంట్లోనే తయారుచేసి ఇవ్వాలి. వేసవి తాపం తీవ్రమవుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో పిల్లలను బయటకు పంపకుండా చూడాలి. అవసరమైతే మాత్రమే, అది కూడా ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్న సమయంలోనే బయటకు పంపాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -