Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి: డా.మానస 

సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి: డా.మానస 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
సీజనల్ వ్యాధులపై ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మండలంలోని  గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  వైద్యాధికారిని మానస గురువారం తెలిపారు. పి హెచ్ సి ద్వారా సోమవారం రోజు గర్భిణీ స్త్రీలకు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం, మంగళవారం, శుక్రవారం, రోజులలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, అంటూ వ్యాధుల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు., జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా బుధవారం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వ్యాధి నిరోధక టీకాలను అందించడం జరుగుతుందనీ, గురువారం వయోవృద్ధులకు వైద్య పరీక్షలు అందించడం జరుగుతుందనీ అన్నారు. కుక్క కాటుకు, పాము కాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -