- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను సోమవారం నుంచి మండల కేంద్రమైన తాడిచెర్లలో వ్యవసాయ శాఖ అధికారులు సర్వేను ప్రారంభించారు. మండలం వ్యాప్తంగా 300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రాబోయే నాలుగైదు రోజుల్లో వ్యవసాయశాఖ అధికారులు ప్రతి గ్రామంలో పంట నష్టాలపై సమగ్ర నివేదికలను తయారు చేసి ప్రభుత్వం రూపొందించనున్న పంటనష్టం యాప్లో నివేదించనున్నట్లు తెలిసింది. దీంతో బాధిత రైతులకు నష్టపరిహారం అందే అవకాశం ఉంది.
- Advertisement -



