Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

– మండలం నాలుగు కస్టర్లుగా విభజన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడవ విడతలో  మండలంలో జరిగే పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలను నాలుగు క్లస్టర్ గా విభజించినట్లు తెలిపారు. క్లస్టర్-1 కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి కే.రాజన్న ద్వారా కమ్మర్ పల్లి, నాగాపూర్, ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.

క్లస్టర్-2 చౌట్ పల్లి గ్రామ పంచాయతీలో స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి కే.గంగాధర్ ద్వారా చౌట్ పల్లి, బషీరాబాద్, హాస  కొత్తూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.క్లస్టర్-3 కోన సముందర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి మధుపాల్ ద్వారా కోన సముందర్, నర్సాపూర్, ఇ lనాయత్ నగర్, అమీర్ నగర్ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.క్లస్టర్-4 కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి చౌడరపు రాంప్రసాద్ ద్వారా కోనాపూర్, దొమ్మరి చౌడ్ తండా, కొత్తచెరువు తండా గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు సమర్పించాలని సూచించారు. అంతకుముందు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి మండలంలో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -