Wednesday, July 1, 2026
E-PAPER
Homeఖమ్మంరూ.69 తగ్గిన పామాయిల్ గెలల ధర

రూ.69 తగ్గిన పామాయిల్ గెలల ధర

- Advertisement -

– జూన్ నెలకు టన్ను గెలల ధర రూ.23,783 లు
– ధర ప్రకటించిన ఆయిల్ ఫెడ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

జూన్ నెలలో రైతుల నుంచి సేకరించిన పామాయిల్ తాజా గెలలకు టన్నుకు రూ.23,783 చెల్లించనున్నట్లు ఆయిల్ ఫెడ్ అధికారులు బుధవారం ప్రకటించారు. మే నెలలో టన్ను గెలల ధర రూ.23,852 ఉండగా, జూన్ నెలకు రూ.23,783గా నిర్ణయించారు. దీంతో గత నెలతో పోలిస్తే టన్నుకు రూ.69 తగ్గింది. అయితే ఈ ఏడాది పామాయిల్ గెలల ధరలు పెద్దగా హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -