జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
దీపావళి పండుగ సందర్భంగా జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పదలచిన వ్యాపారులు పోలీస్ సర్కిల్ అధికారి, ఫైర్ అధికారి, మున్సిపాలిటీ అధికారుల దగ్గర ధరఖాస్తు చేసుకొని ముందస్తుగా అనుమతి పొందవలసిందిగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం ఫైర్, సర్కిల్ పోలీస్ అధికారిని సంప్రదించవలసిందిగా కోరారు.
అలాగే ఎటువంటి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు నెలకొల్పిన వారి పట్ల Explosives Act – 1884 మరియు Rules – 1933 (సవరణ 2008) ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
బాణసంచా దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాల
పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత ఫైర్ మరియు సర్కిల్ పోలీస్ అధికారి గారి కార్యాలయంలో సమర్పించాలి.
టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి.
ఒక క్లస్టర్ లో 50 షాపులకు మించరాదు.
జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు.
జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలి.
దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, రెండు ఫైర్‌ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు.
బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి.
టపాసుల దుకాణానికి నిర్ధేశిత రుసుము చెల్లించి. విధ్యుత్, ఫైర్ శాఖతో పాటు మున్సిపల్ శాఖల NOC అనుమతి తప్పనిసరి.
ఈ లైసెన్సులు 3 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి.
200 లీటర్ల వాటర్ బ్యారల్. నాలుగు ఇసుక బకెట్లు, నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి.
దుకాణంలో ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు పాత కరెంట్ తీగలు ఉంచరాదు. జాయింట్ కేబుల్స్ వాడవద్దు.
జనరేటర్ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి.
దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి.